5 April, 2026 | 8:26 PM

జహీరాబాద్‌లో 72.48 శాతం పోలింగ్

14-05-2024 02:33 AM

ఓటేసేందుకు భారీగా తరలివచ్చిన మహిళలు, యువత 

సంగారెడ్డి, మే 13 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో సాయంత్రం 6 గంటల వరకు 72.48 శాతం పోలింగ్ నమోదయిం ది. ఈ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఆందోల్, నారాయ ణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లు, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్లు ఉన్నాయి. అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 74.83 శాతం, తక్కువగా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 70.54 శాతం పోలింగ్ నమోద యింది. పార్లమెంట్ నియోజకవర్గంలో అధి క ఓట్లు జహీరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఇక్క డే తక్కువ పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీల్లో ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో యువత, మహిళలు అధికంగా పాల్గొని ఓట్లు వేశారు. 

చెదురుమదురు ఘటనలు మినహా..

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ అధికారు లు వెంటనే సమస్యను పరిష్కరించారు. జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్, బీజే పీ శ్రేణుల మధ్య, జహీరాబాద్ మండలంలోని మడ్గి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల నడుమ ఘర్షణ నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని కొట్టుకున్నారు.   

ఓటేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు

ఆందోల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఓట్లు వేశారు. కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్‌లు సంగారెడ్డిలో ఓట్లు వేశారు. రాష్ట్ర గిరిజ న సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ కుటుంబ సభ్యులతో కలిసి సంగారెడ్డిలో ఓట్లు వేశారు.