14-01-2026 02:27:54 AM
ప్రజా సమస్యలను పట్టించుకోని మాజీ మంత్రి మల్లారెడ్డి
జవహర్ నగర్, జనవరి 13 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ జవహర్ నగర్ పరిదిలో భారతీయ జనతా పార్టీ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా గబ్బిలాల పేట ప్రాంతాన్ని సందర్శించింది. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసేందుకు ఈ బస్తీ బాట పట్టిందని ఈ ప్రాంత ప్రజలు డెంగు, మలేరియా, టైఫాయిడ్ వం టి అనేక రకాల జ్వరాలతో తీవ్రంగా బాధపడుతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా గబ్బిలాల పేట ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. గతంలో మాజీ మంత్రి మల్లారెడ్డి జవహర్‌నగర్ నా గుండెకాయ అని చెప్పిన మాటలు ఫొటో లు, ప్రచారానికే పరిమితమయ్యాయి. వాస్త వ పరిస్థితి చూస్తే జవహర్ నగర్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా, ఈ ప్రాంత అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేని పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ రాష్ట్ర అధికారంలోకి రాగానే జవహర్ నగర్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన హామీలు, ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చేసిన వాగ్దానాలు ఇప్పటివరకు అమలుకాలేదు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్ రాష్ట్ర నాయకులు మైపాల్ రెడ్డి, బిజెపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి, ఉపాధ్యక్షులు రఘురాం చారి యువ మోర్చా ప్రధాన కార్యదర్శి చందు, సీనియర్ నాయకులు గిరి కత్తుల వెంకన్న మల్లికార్జున్ గౌడ్ శ్రీధర్ ఆంజనేయులు చారి రామకృష్ణ, ప్రవీణ్, విష్ణు వర్ధన్‌రెడ్డి మల్లేష్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.