18 August, 2026 | 7:51 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక దాడి

24-05-2024 12:34 AM

గాజులరామారం సర్కిల్ ఎస్‌ఎఫ్‌ఏ కామ లీలలు

వీడియోలు బయట పెడుతానని బెదిరింపులు 

వేధింపులకు పాల్పడ్డ అధికారి సస్పెండ్

మేడ్చల్, మే 23 (విజయక్రాంతి) : మహానగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఓ ప్రభుత్వ ఉద్యోగే కిందిస్థాయి మహిళా సిబ్బందిని బెదిరించి కామ క్రీడల్లో మునిగిపోయి అడ్డంగా దొరికిపోయాడు. వివరాలలోకి వెళ్తే... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్‌లో కిషన్,   ప్రణయ్ సానిటేషన్ సూపర్‌వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 

పారిశుధ్య కార్మికుల హాజరు వేయడం, వారితో పని చేయించడం వాళ్ల విధి. అయితే, ఇదే అదనుగా మహిళా పారిశుద్ధ్య కార్మికులను లొంగదీసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళా పారిశుధ్య కార్మికురాలిని బెదిరించి లొంగదీసుకున్నారు. ఆమెపై లైంగిక దాడికి దిగడంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు తీశారు. వారు చెప్పినట్టు వినకుంటే, అడిగినప్పుడు రాకుంటే తీసిన వీడియోలను బయట పెడుతామని బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న సర్కిల్ ఉన్నతాధికారులు కిషన్, ప్రణయ్‌లను సస్పెండ్ చేశారు.