18 August, 2026 | 8:37 PM

మద్యం మత్తులో నదిలో దూకిన యువకుడు మృతి

24-05-2024 12:32 AM

చార్మినార్ మే 23 (విజయక్రాంతి): పాతబస్తీ చెందిన యువకు డు మద్యం మత్తులో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కర్ణాటకలో కమాలపూర్ చెడుగుప్పలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడకు చెందిన నలుగురు ఆటోడ్రైవర్లు విహారయాత్ర కోసం కర్ణాటకలో కమాలపూర్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత సాజిద్, గోటి, అపుగోమా, తాజుద్దీన్ నలుగురు ఫుల్‌గా మద్యం సేవించారు. మత్తులో ఉండగా ముగ్గురు స్నేహితులు నీకు దమ్ముంటే నదిలో దూకి ఈత కొట్టాలంటూ సాజిద్‌ను రెచ్చగొట్టారు. దీంతో మద్యం మత్తులో ఉన్న సాజిద్ నదిలోకి దూకాడు.

అయితే, సాజిద్‌కు ఈత రాకపోవడంతో అందరూ చూస్తుండగానే నదిలో మునిగిపోయి మృతి చెందాడు. అయితే, సాజిద్ మునిగిపోతున్న క్రమంలో అతని పక్కనే ఉన్న స్నేహితులు కాపాడే ప్ర యత్నం చేయలేదు. పైగా, సాజిద్ మునిగిపోతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో  రికార్డు చేశారు. దీనికి సంబం ధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో గురువారం సాజిద్ మృతదేహాన్ని పాతబస్తీకి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.