03-07-2025 01:22:24 AM
ముంబైలో మహిళా టీచర్ ఘాతూకం
ముంబై, జూలై 2: ముంబైలో ఒక మహిళా టీచర్ ఏడాది కాలంగా 11వ తరగతి విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. విద్యార్థి వద్దని వారించినా పలుమార్లు ఫైవ్‌స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. టీచర్ ప్రవర్తనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీ సులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసుల సదరు మహిళా టీచర్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది.
2023లో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా బాధిత విద్యార్థితో టీచర్ పరిచయం పె ంచుకుంది. ఆ తర్వాత టీచర్.. విద్యార్థిని పలుమార్లు ఫైవ్‌స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడింది. కాగా కుమారుడి ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.