calender_icon.png 28 November, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ హెరాల్డ్ ఆస్తులపై సోనియా, రాహుల్ కన్ను

03-07-2025 01:25:14 AM

న్యూఢిల్లీ, జూలై 2: నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పత్రిక ప్రచురణ కర్త అసోసియే టెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) యాజమాన్య హక్కులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రూ. 50 లక్షలు చెల్లించి కొనుగోలు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలు చేసింది. కేసు రోజువారి విచారణ ఢిల్లీ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు తన వాదనలు వినిపించారు. ఈడీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి రూ.90 కోట్ల రుణం తీసుకున్న తర్వాత ‘యంగ్ ఇండియన్’ అనే సంస్థను ఏర్పాటు చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. ఈ సంస్థలో సోనియా, రాహుల్ గాంధీకి కలిపి 76 శాతం షేర్లు ఉన్నాయని తెలిపారు.