calender_icon.png 10 September, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో ఘనంగా ఎస్జీఎఫ్ కొత్తపల్లి మండల స్థాయి ఎంపిక పోటీలు ప్రారంభం

10-09-2025 12:42:23 AM

కొత్తపల్లి, సెప్టెంబరు 9 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి అండర్ 14, 17 కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ & అథ్లెటిక్స్ క్రీడల పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

తుమ్మ ఆనందం, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డిలు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని, వారికి వివిధ పోటీలో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పించాలని అన్నారు.

విద్యార్థులు క్రీడలలో పాల్గొనడమే కాకుండా వాటిలో విజయం సాధించడమే లక్ష్యంగా సాధన చేసి అగ్రగామిగా ఉండాలని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడలను ఎంపిక చేసుకోవాలని, వాటిలో పాల్గొని శారీరకంగా, మానసికంగా దృఢంగా కావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పెట జిల్లా అధ్యక్షులు బాబు శ్రీనివాస్, గిన్నె శ్రీనివాస్, శ్రీనివాస్, ఈ.హరీష్, బి. వేణుగోపాల్, పలు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.