calender_icon.png 10 September, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ నోరు విప్పితే అబద్ధాలు

10-09-2025 12:42:31 AM

-గోబెల్స్‌ను మించిపోయాడు

-జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు

-గ్రూప్ అభ్యర్థులకు సీఎం క్షమాపణ చెప్పాలి

-మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపణలు

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాం తి): రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువైందని, అసత్య ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ను మేమే కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ కత్తెర జేబులో పెట్టుకోని తిరుగుతున్నారని, ఎక్కడ రిబ్బన్ కనిపిస్తే అక్కడ కత్తిరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిన్న రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ట్యాం కులు కేసీఆర్ హయాంలో ప్రారంభించినవేన ని, వారిలాగా దిక్కుమాలిన దివాళాకోరు రాజకీయాలకు కేసీఆర్ చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2,052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపామన్నారు. ‘మేము నీలాగా చిల్లర రాజకీయాలకు పోలేదు.. నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన కూడా మేము నిర్మించిన కాళేశ్వరం నీళ్లనే తీసుకెళ్తున్నావ్’ అని వాపోయారు. ఎల్లంపల్లి సామర్థ్యానికి మించి మరో 20 టీఎ ంసీలు హైదరాబాద్‌కు ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నావని, ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు గాలిలో వస్తున్నాయా? అని నిలదీశారు. కేసీఆర్ ముందుచూపుతో హైదరాబాద్ మంచి నీటి కోసం మల్లన్న సాగర్‌లో స్లూయిస్ కూడా నిర్మించి పెట్టారని, గండిపేట కు, హిమాయత్ సాగర్ వచ్చేవి కాళేశ్వరం నీళ్లేనన్నారు. ఒకరేమో  కాళేశ్వరాన్ని తిట్టుడు.. మరొకరు కాళేశ్వరాన్ని మొక్కుడు.. అంటూ ఎద్దేవాచేశారు. మల్లన్న సాగర్ కట్టింది వైయస్ రాజశేఖర్‌రెడ్డి అని సీఎం అంటున్నారని, ఆయ నే బతికుంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుకొనేవారని పేర్కొన్నారు.

మూసీలో మొ న్న 300 ఇళ్లను కూలగొట్టిన రేవంత్ రెడ్డి.. చివరికి కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్ రూములు మాత్రమే వాళ్లకిచ్చి రూపాయి పరిహారం కూ డా ఇవ్వలేదని విమర్శించారు. మూసీలో ఖాళీ చేయించిన వారికి ఇచ్చిన 25 వేల చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని ఆరోపించారు. సెక్రటేరియట్‌కు కూడా పునాదిరాళ్లు నేనే (సీఎంను ఉద్దేశించి) మోసానని, అమరవీరుల స్థూపానికి కూడా నేనే మేస్త్రిని అంటాడేమోనని ఆయన వెల్లడించారు. ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా మా తాత కట్టిండు అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. మంచి పనులు చేస్తే మేము సహకరిస్తామని హరీశ్‌రావు చెప్పారు.

పరీక్షలు నిర్వహించడం రాదు

గ్రూప్ మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరో పణల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డి.. ఈ కోర్టు తీర్పుకు వాళ్లు చెప్పే సమా ధానం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడటంతో  నిరుద్యోగులు బల వుతున్నారని ఆయన విమర్శించారు. గప్పా లు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదదన్నారు. నిరుద్యోగులందరికీ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.