21-12-2025 12:07:24 AM
ఆది సాయికుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. డిఫరెంట్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమా విశేషాలను నిర్మాతలు రాజశేఖర్, మహీధర్‌రెడ్డి మీడియాతో పంచుకున్నారు.
స్క్రిప్ట్ కన్నా ముందు స్టోరీ. కథ బాగా నచ్చడంతో డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే రంగంలోకి దిగాం. ముందుగా ఆది సాయికుమార్‌తో వేరే కథ అనుకున్నాం కానీ, ఇంతలో ఈ స్టోరీ రావడంతో ఇది కంప్లీట్ చేశాం. ఈ స్టోరీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్మి, ఈ కథపై ఇన్వెస్ట్ చేశాం.
ఆది మార్కెట్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ‘శంబాల’కు కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. హిందీ థియేట్రికల్ రిలీజ్ కూడా చేయడానికి ప్లాన్ చేశాం. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో హిందీ రిలీజ్ ఉంటుంది.
దర్శకుడు యగంధర్ ముని షార్ట్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్‌లో ఎలా ఉంటుందో చూశాం. చాలా బాగా వచ్చింది. మొదటి, రెండో షెడ్యూల్ తర్వాత చిత్రబృందానికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. స్టోరీ పరంగా పూర్తిగా డిఫరెంట్. ఏ సినిమాతో దీనికి పోలిక లేదు. సినిమాకు బలం కంటెంటే. ‘కల్కి’ వచ్చిన తర్వాత ‘శంబాల’ అనేది అందరికీ తెలిసింది. ఓ మీనింగ్ ఉంది.
ఆ ప్లేస్ ఏంటి? దాని మీనింగ్ ఏంటో? ఈ సినిమాలో కనిపిస్తుంది. మా సినిమాలో హారర్‌తోపాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి ఉంటాయి. మైత్రి వాళ్లు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా పాజిటివ్. హీరో, హీరోయిన్స్‌తోపాటు సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది.
శంబాల ఫస్ట్ పార్ట్ అయితే ప్రాపర్‌గా ఎండ్ చేశాం. సెకండ్ పార్ట్ కోసం స్మాల్ లీడ్ ఇచ్చాం. కొంచెం క్యూరియాసిటీ ఉండేలా క్లోజ్ చేశాం. దాని గురించి మళ్లీ ఆలోచిస్తాం.