calender_icon.png 21 December, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ బయోపిక్ షురూ

21-12-2025 12:05:07 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయోపిక్ ‘మా వందే’ టైటిల్‌తో రూపొం దుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోదీ పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటి రవీనా టండన్ ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ మోదీ జీవితాన్ని యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్.

సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్‌రెడ్డి ఎం నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం పూజా కార్యక్ర మాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం రోజే రెగ్యు లర్ షూటింగ్ కూడా మొదలుపెడుతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమా ణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ ఎక్స్‌తో రూపొందనుంది. దీన్ని పాన్ ఇండి యా భాషలతోపాటు ఇంగ్లీష్‌లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్; డీవోపీ: కేకే సెంథిల్ కుమార్; యాక్షన్: కింగ్ సోలొమన్; ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్; ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్; నిర్మాత: వీర్‌రెడ్డి ఎం; రచన, దర్శకత్వం: క్రాంతికుమార్ సీహెచ్.