16 July, 2026 | 2:03 AM

ఘనంగా శనీశ్వర మహా జయంతి ఉత్సవం

07-06-2024 02:19 AM

హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ

ఝరాసంగం, జూన్ 6: శనీశ్వర స్వామిని దర్శించుకుంటే సమస్యలు దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని, మానవ జీవితాలపై తప్పకుండా గ్రహాల ప్రభావం ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గురువారం ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని దత్తగిరి మహారాజ్ ఆశ్రమ ఆవరణలో నిర్వహించిన శనీశ్వర మహా జయంతి ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి ఆశ్రమ పీఠాధిపతులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంత్రి శనీశ్వర స్వామిని దర్శించుకొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పవిత్ర గ్రంథాలను పఠనం చేసి, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్ధేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, శనీశ్వరుని మహా జయంతి ఉత్సవాలకు మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ పద్మజ రాణి, డీఆర్‌డీవో జ్యోతి, ఎంపీడీవో సుధాకర్, ఏపీవో రాజ్‌కుమార్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.