calender_icon.png 22 October, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శర్వా.. బైకర్

22-10-2025 01:15:00 AM

శర్వా ఇప్పుడు తన 36వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు ‘శర్వా 36’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ఆయన మోటార్ సైకిల్ రేసర్ పాత్రను పోషిస్తున్నారు. అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ -ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. దీపావళి సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

దీనికి ‘బైకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వెల్లడిస్తూ మేకర్స్ విడుదల చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో శర్వా ఇంటెన్స్ బైకర్ డ్రెస్‌లో స్పోర్ట్స్ బైక్‌పై కనిపించి ఆకట్టుకున్నారు. 1990- 2000ల బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రేసింగ్ డ్రీమ్స్, ఎమోషన్స్,  ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోంది.

ఇందులో శర్వా సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుండగా బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జే యువరాజ్ సినిమాటో గ్రఫీని, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. అనిల్‌కుమార్ పీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రానికి రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఏ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.   

సంక్రాంతి సదంట్లో ‘నారి నారి నడుమ మురారి’  

శర్వా హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. బ్లాక్‌బస్టర్ ‘సామజవరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలు. దీపావళి సందర్భంగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. గతంలో ‘శతమానం భవతి’తో బ్లాక్‌బస్టర్ అందించిన శర్వాకు సంక్రాంతి లక్కీ సీజన్‌గా భావించిన మేకర్స్ ఈ సినిమాతో సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్‌డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వా సాంప్రదాయ పంచెకట్టులో పూల మంచంపై స్టులిష్‌గా నడుస్తూ కనిపించి ఆకట్టున్నారు.

త్వరలో షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్; సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్; ఆర్ట్: బ్రహ్మ కడలి; నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర; కథ: భాను బోగవరపు; మాటలు: నందు సవిరిగాన; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.