calender_icon.png 22 October, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకరవరప్రసాద్ స్టులే వేరు

22-10-2025 01:12:19 AM

చిరంజీవి హీరోగా నటిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అనేది ట్యాగ్‌లైన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో అలరించనుండగా, వీటీవీ గణేశ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రానుంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ ఇప్పటికే రికార్డ్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

తాజాగా మేకర్స్ దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ ఎంతో స్టులిష్‌గా, యంగ్ లుక్‌లో, తన సిగ్నేచర్ స్మైల్‌తో బ్లాక్‌మౌంటెన్ బైస్కిల్‌పై సవారీ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చిరు పక్కనే ఇద్దరు స్కూల్ పిల్లలు కూడా సైకిల్ సవారీ చేస్తుండటం పోస్టర్‌కి మరింత ఫ్యామిలీ ఫ్రెండ్లీ టచ్‌ను జోడించినట్టయింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: సమీర్‌రెడ్డి; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటింగ్: తమ్మిరాజు.