calender_icon.png 8 May, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలాఖరున షష్టిపూర్తి

07-05-2025 12:00:00 AM

రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా ద్వారా పవన్‌ప్రభ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయనున్నారు.

తాజా రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సందర్భంగా దర్శకనిర్మాతలు పవన్‌ప్రభ, రూపేశ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు ఎందరో హేమాహేమీలు పనిచేశారు. అభినయంలో ఆరితేరిన రాజేంద్రప్రసాద్, అర్చన ఈ సినిమాకు మెయిన్ అస్సెట్. ఇళయరాజా స్వరాల వల్ల మా చిత్రానికి ప్రేక్షకుల్లో గొప్ప అటెన్షన్ వచ్చింది.

‘ఏదో ఏ జన్మలోదో..’ పాటకు కీరవాణి సాహిత్యం అందించడం మా అదృష్టం. రెహమాన్ రచించిన ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె‘ పాటను ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు. మిగిలిన 3 పాటలే, ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు.