08-05-2025 02:45:03 PM
మంథని, (విజయక్రాంతి): ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 12వ తేదీ వరకు మలేషియాలోని హైపోసిటీ కౌన్సిల్ స్పోర్ట్స్ హాల్లో నిర్వహించే అంతర్జాతీయ కరాటే(International Karate Tournament ) పోటీలకు పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన జపాన్ షిటోరియు కరాటే అకాడమీ శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో మెట్టు హాసిని (19) 61 కేజీలు కథ కుమితే విభాగాలలో ఈ అంతర్జాతీయ కరాటే పోటీల్లో మలేషియా కు ఎంపికయ్యారు. ఎంపికైన వారిని మెట్టు హాసిని జపాన్ షిటోరియు శికొకాయి కరాటే ఇండియా అధ్యక్షులు భరత్ శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జపాన్ షిటోరియు కరాటే జాతీయ ఉపాధ్యక్షులు పాపయ్య, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, ఎం రామస్వామి, శ్రీనివాస్ ఇన్స్ట్రక్టర్ నా గల్లీ రాకేష్, కావేటి శివ, గణేష్, మూగ శివాని, ఎండి తైభ, టి హర్షిని కే శ్వేత నందన కె విష్ణు, బి విష్ణువర్ధన్, నక్క రాజు, గేయ శ్రీరామ్, తేజ, శ్రీరాములు అభినందించారు.