calender_icon.png 8 May, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసేమియా రహిత తెలంగాణగా మార్చుదాం

08-05-2025 02:42:17 PM

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు

కామారెడ్డి, (విజయక్రాంతి): ప్రపంచ తలసేమియా వ్యాధి దినోత్సవాన్ని(World Thalassaemia Day) పురస్కరించుకొని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో తల సేమియా రహిత తెలంగాణ కరపత్రాలను గురువారం కర్షక్ బిఈడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె రషీద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది తలసేమియా వ్యాధితో చిన్నారులు బాధపడుతున్నారని,దేశంలో ప్రతిరోజు తలసేమియా వ్యాధి చిన్నారులు జన్మిస్తున్నారని,శిశువు గర్భంలో ఉన్నప్పుడే హెబి ఎలక్ట్రోపోరోసిస్ పరీక్ష,జన్యు పరీక్షలు,రక్త పరీక్ష లతో ముందుగానే గుర్తించవచ్చునని అన్నారు.అలా గుర్తించడం వలన శిశువు జన్మించినప్పుడు ఈ వ్యాధి రాకుండా ప్రయత్నం చేయవచ్చునని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ప్రతి 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని ఈ చిన్నారుల కోసం 2750 యూనిట్లకు పైగా రక్తాన్ని ఇప్పటివరకు అందజేయడం జరిగిందని తెలిపారు,రానున్న రోజులలో చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తలసేమియా చిన్నారులకు వైకల్యం కూడుకున్న సర్టిఫికెట్లను,వ్యాధులు రాకుండా ఉండడానికి కావలసిన పరీక్షలను ఉచితంగా అందజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆధ్యాపకులు, కిషన్,నర్సింలు,బాపురావు  తదితరులు పాల్గొన్నారు.