calender_icon.png 7 May, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్తమాన రాజకీయాల నేపథ్యంలో..

07-05-2025 12:00:00 AM

అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బీఆర్‌కే నిర్మించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించింది. డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. “ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు.

ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు? సినిమా ద్వారా ఈ ప్రశ్నను నేను అడుగుతున్నా. కనీసం ఈ సినిమా తర్వాత అయినా అది ప్రారంభమవుతుందని నేను ఆశిస్తున్నా. గతంలో నేను ‘హైడ్రాబాడ్ సిటీ’ అన్నానని కాంట్రవర్సీ చేశారు. నేను అన్నది హైదరాబాద్ బ్యాడ్ అని కాదు. సీఎం రేవంత్‌రెడ్డి ‘హైడ్రా’తో అక్రమాలను బయటపెట్టారు. అది సక్సెస్ అయితే వర్షాలొచ్చినప్పుడు సిటీ మునిగిపోకుండా ఉంటుంది.

ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్ వ్యాధి కన్నా మించింది బూతు. బూతులు మాట్లాడితే ఐదేళ్లపాటు పోటీ చేయకుండా నిషేధం విధించాలనే రూల్ తీసుకురావాలి. పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోతారన్న రూల్ రావాలి. ఇవే విషయాలను మా సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో చూపించబోతున్నా” అన్నారు. నటుడు అజయ్, ప్రొడ్యూసర్ రామకృష్ణ కూడా సినిమా గురించి మాట్లాడారు.