07-05-2025 12:00:00 AM
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లి దాదాపు ఐదేళ్లవుతోంది. రాజకీయాల్లో బిజీగా మారిన నేపథ్యంలో ఈ సినిమాను పూర్తి చేయలేకపోయారు. అందుకే ఈ సినిమాతో పాటు తన చేతిలో ఉన్న మరో మూడు చిత్రాలనూ ఆగస్టులోగా పూర్తిచేస్తానని పవన్ నిర్మాతలకు మాటిచ్చినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే పవన్‌కల్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేశారు. పవన్ కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తయింది. రెండు రోజుల పాటు పవన్ షూటింగ్‌లో పాల్గొనడంతో ఇది సాధ్యమైందని మేకర్స్ వెల్లడించారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించి వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ లెక్కన మే 30 లేదా జూన్ రెండో వారంలో ఈ సిని మా థియేటర్లకు వచ్చే అవకాశముందని ఫిలింనగర్ టాక్. త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వ హించిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.