calender_icon.png 8 May, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగ కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు

08-05-2025 02:50:35 PM

 విఠలేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు  ద్రోణవల్లి సతీష్

బాన్సువాడ,(విజయక్రాంతి): అధికార మదంతో అక్రమ కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని పిట్టలేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మ న్  ద్రోణవల్లి సతీష్ అన్నారు. గురువారం  కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని  బైరాపూర్ గ్రామంలో విఠలేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంద అన్నారు. అనవసరంగా రాద్ధాంతం చేసి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తమపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. 

విఠలేశ్వర స్వామి గుడి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని  ముందు రోజు గ్రామంలో చాటింపు వేయించి  గ్రామ ప్రజలు అందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింద న్నారు. కొందరు కావాలని ఒక వర్గానికి చెందినవారు ఘర్షణ వాతావరణం సృష్టించి గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఘర్షణ వాతావరణం సృష్టించిన వారే అధికార మత్తుతో వారి నాయకుల అండదండలతో నాతో సహా 12 మంది గ్రామ ప్రజల మీద అక్రమ కేసులు బనయించారని తెలిపారు. అక్రమ కేసులు బనాయించినందుకు  నిరసిస్తూ గ్రామం నుండి దాదాపుగా 350 మంది గ్రామ ప్రజలు బీర్కూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింద న్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని బాన్సువాడ నియోజకవర్గం ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు.  వారికి వారి నాయకులకు హితబోధ చేస్తూ రాబోవు రోజుల్లో నియోజకవర్గం ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.