calender_icon.png 10 September, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 17 లోపు లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు

08-05-2025 01:43:42 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 17 లోపు లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Collector Koya Sree Harsha)  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తుందని, మే 5 నుంచి మీ సేవా కేంద్రాలలో 100 రూపాయలు చెల్లించి దరఖాస్తు, ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మే 17 లోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మీసేవ కేంద్రాల్లోని సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.  

ఇంటర్ లో గణితం లో 60 శాతం మార్పులు సాధించిన వారు, ఐటిఐ డ్రాఫ్ట్స్ మెన్(సివిల్) , డిప్లమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు 50 పని దినాలలో శిక్షణ ఇస్తామని, శిక్షణ కోసం ఓసి అభ్యర్థులు పదివేల రూపాయలు బీసీ అభ్యర్థులు 5000 రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 200500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని , మరిన్ని వివరాలకు 9849081489, 7032634404, 9441947339 ఫోన్ నెంబర్ల నందు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.