08-05-2025 02:35:15 PM
హెలికాప్టర్ కూలిన ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నాని వద్ద గురువారం ఉదయం ఏడుగురు వ్యక్తులతో కూడిన హెలికాప్టర్(Uttarakhand Helicopter Crash) కూలిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారని విపత్తు నిర్వహణ అధికారి వెల్లడించారు. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఏపీకి చెందిన వేదవతి కుమారి, విజయారెడ్డి ఉన్నారు. వేవవతి కుమారి.. అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరిగా గుర్తించారు. హెలికాప్టర్ ప్రమాదంలో వేదవతి భర్త భాస్కర్ కు గాయాలయ్యాయి. గాయపడన భాస్కర్ ను రిషికేశ్ ఎయిమ్స్ కు తరలించారు. హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఉదయం 8:45 గంటల ప్రాంతంలో రిషికేశ్-గంగోత్రి జాతీయ రహదారి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరిని రక్షించామని ఉత్తరకాశీ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి శార్దుల్ సింగ్ తెలిపారు.
అహ్మదాబాద్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ ఏరోట్రాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న ఈ హెలికాప్టర్ బెల్ మోడల్. ఈ ప్రమాదంతో రెస్క్యూ బృందాలు త్వరితగతిన చర్యలు తీసుకున్నాయి. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Aircraft Accident Investigation Bureau) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. అధికారుల ప్రకారం, ఏరోట్రాన్స్ సర్వీసెస్ రెండు బెల్ హెలికాప్టర్లు, ఒక సెస్నా విమానాన్ని నడుపుతోంది. భారత గగనతలంలో విమాన ప్రమాదాలను పరిశోధించే బాధ్యత కలిగిన ఏఏఐబీ (AAIB) ప్రమాదం వివరాలను పరిశీలించి భద్రతా మెరుగుదలలను సిఫార్సు చేస్తుంది.