03-06-2025 04:16:25 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, నీలం దుర్గేష్ తదితరులు పాల్గొని జన్మదిన కేక్ కట్ చేశారు.