శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
24-04-2024 01:29 AM
నారాయణఖేడ్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూరు మండలం తిమ్మాపూర్‌లో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అంతర్‌గాం పీఠాధిపతి కరణ్ గజేంద్రమహారాజ్, మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు శివాజి యూత్ సభ్యులు పాల్గొన్నారు.






