calender_icon.png 3 May, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు షాక్

03-05-2025 01:14:18 AM

ముందస్తు బెయిల్‌కు నిరాకరించిన హైకోర్టు

హైదరాబాద్, మే 2: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన అమెరికాకు పారిపోయిన విషయం తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్ ఇస్తే, స్వదేశానికి వచ్చి విచారణకు సహకరిస్తానని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌లో హైకోర్టు శుక్రవారం ఇరువర్గాల వాదనలు విన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రెడ్డి కీలక నిందితుడని, అతడికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన హైకోర్టు ప్రభాకర్‌రావు ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. మరోవైపు యూఎస్‌లో ఉన్న ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.