calender_icon.png 24 May, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల పథకం ఇక వేగవంతం!

03-05-2025 01:20:02 AM

  1. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఊపందుకోవాలి 
  2. ఎప్పటికప్పుడు మంత్రుల ఆమోదం తీసుకోవాలి 
  3. ఇంటినిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులే ఉండాలి
  4. 5నుంచి 20వతేదీ వరకు 28మండలాల్లో భూభారతి
  5. నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి 
  6. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించిన 3,500ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ర్ట హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధ్దిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏ రోజుకారోజు ఇన్‌చార్జ్ మంత్రుల నుంచి లబ్ధిదారుల జాబితాకు ఆమోదం తీసుకోవాలని, అలాగే ప్రతీ నియోజకవర్గంలోని పట్టణప్రాంతంలో కనీసం 500ఇండ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.

శుక్రవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో అనర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. లిస్ట్- లిస్ట్ , లిస్ట్ సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. 

5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు.. 

గత నెల 17వ తేదీ నుంచి 30వతేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీవరకు జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని పొంగులేటి తెలిపారు. పైలట్ మం డలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31వ తేదీవరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ దర ఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు.

605మండలాలకుగాను ఇప్పటివరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందని ఇందులో 85,527 మంది పౌరులు, 1,62, 577 మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు.  ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమో దు చేయాలని, అసైన్డ్ ల్యాండ్‌లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టాలేనివారు, పట్టాఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు. 

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు.. 

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈనెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు  ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ ఏడాది రాష్ర్టం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజర వుతున్నారని ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటితోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్‌లను అందుబాటులో ఉంచు కోవా లన్నారు. సమావేశం లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌ సింగ్ సెక్రటరీ జ్యోతి బు ద్ధప్రకాశ్, సీసీఎల్ ఏ డైరెక్టర్ మకరంద్, హౌసిం గ్ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్, లా అండ్ ఆర్డర్ డీఐజీ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.