calender_icon.png 11 January, 2026 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్

11-01-2026 01:12:13 AM

మార్చి 1 నుంచి ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుల పెంపు

వాషింగ్టన్, జనవరి 10: అమెరికా ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచినట్లు అక్కడి యంత్రాంగం ప్రకటించింది. కొత్త ఫీజులు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. హెచ్ పాటు ఎల్-1 వంటి పలు రకాల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసేందుకు అమెరికా ఫీజు వసూలు చేస్తుంది. హెచ్-1బీ లాంటి వీసాల విషయంలో గతంలో 2,805 డాలర్లుగా ఉన్న ప్రీమియం ఫీజు, ఇప్పుడు 2,965 డాలర్లకు పెరిగింది.

విదేశీ ఉద్యోగుల వీసా దరఖాస్తు పరిశీలనను వేగవంతం చేసేందుకు అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీలు ఫీజు చెల్లిస్తుంటాయి. ఇక ఎఫ్- వంటి వీసాల ప్రీమియం ఫీజు కూడా 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఫీజు పెంచినట్లు అమెరికన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగాలు మారే వారు అలాగే వీసాలను రెన్యువల్ చేసుకునే విదేశీయులపై ఈ పెంపు భారం పడనుంది. ఫీజు పెంపుతో వచ్చే అదనపు నిధులతో తమ కార్యకలాపాలను మరింత సరళతరం చేస్తామని అక్కడి ప్రభుత్వం తెలిపింది.