calender_icon.png 12 January, 2026 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హరీశ్ రావు లేఖ

11-01-2026 05:01:44 PM

హైదరాబాద్: సిద్ధిపేట వైద్యశాల ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతన బకాయిలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు ఇవ్వాలని లేఖలో వెల్లడించారు. చిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపెందుకు..?, సంక్రాంతికి ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంతోషంగా ఉండొద్దా..? అని ఆయన ప్రశ్నించారు. సిద్ధిపేట వైద్యశాల, మెడికల్ కాలేజీ సిబ్బంది గోడు వినాలని హరీశ్ రావు పేర్కొన్నారు.