calender_icon.png 11 January, 2026 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో ఆగని హింస

11-01-2026 01:13:25 AM

పథకం ప్రకారం హిందూ యువకుడి హత్య

నెల రోజుల్లో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

ఢాకా, జనవరి 10: బంగ్లాదేశ్ దేశంలో హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. విద్యార్థి నేత హదీ హత్య తర్వాత దుం డగులు ఇప్పటివరకు ఐదుగురు హిందువులను పొట్టనపెట్టుకున్నారు. తాజాగా గురు వారం సాయంత్రం సునాగ్‌మంజ్ జిల్లాలో జైమహాపాత్ర అనే హిందూ యువకుడిపై దాడి చేశారు. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. దాడి ఒక పథకం ప్రకారం జరి గిందని కుటుంబ స భ్యులు ఆరోపిస్తున్నారు.

దాడి తర్వాత అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తి జైమహాపాత్రకు బలవంతంగా విషం ఇచ్చా డని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిం దితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతున్నది.