11-01-2026 04:15:36 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడా సరస్వతి శిశు మందిర్ లో 30 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. 1994 95 విద్యాసం పదో తరగతి పూర్వ విద్యార్థులు చదువు పూర్తయి ఉద్యోగుల వ్యాపార రంగాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడగా వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 30 ఏళ్ల అనంతరం కలుసుకున్నారు పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో అప్పట్లో బోధించిన గురువులకు సన్మానం చేసి ఆప్యాయతగా పలకరించుకుని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు