11-01-2026 05:40:28 PM
హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(Srisailam Left Bank Canal) పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, ఇతర ఇంజినీర్లు హాజరయ్యారు. ఎస్‌ఎల్‌బీసీ పనుల పునఃప్రారంభం, సంబంధిత అంశాలపై చర్చించారు.