calender_icon.png 12 January, 2026 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ

11-01-2026 05:25:36 PM

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్షణ్ పర్యటిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ లో రూ.175 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, గోదావరిఖనిలో 576 ప్లాట్లకు పట్టాలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజారు పత్రాలను మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపిస్తారని, రామగుండంలో అదనంగా తాహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రహదారి విస్తరణలో నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని, అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని, రూ.600 కోట్లతో రామగుండం అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు, కొత్త కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.