calender_icon.png 11 January, 2026 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారంలో ఆదివారం అంగడి వారాంతపు సంత

11-01-2026 04:04:13 PM

 ప్రారంభించిన 3 గ్రామాల సర్పంచులు

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని నాగారం గ్రామంలో కీర్తిశేషులు బూడిద లింగయ్య (లక్కారం లింగయ్య) స్మారకార్థంగా ఏర్పాటు చేసిన  ఆదివారం అంగడి (వారాంతపు సంత) ను నాగారం గ్రామ సర్పంచ్ బెల్లంకొండ శ్రీదేవి- సత్యనారాయణ రెడ్డి పరిసర గ్రామలైన కన్నాల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య, మల్లేపల్లి గ్రామ సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ  చేతుల మీదుగా  నాగారం గ్రామంలో వారాంతపు సంతను ప్రారంభించారు.

ఈ సందర్భంగా 3 గ్రామాల నూతన సర్పంచులు మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా పోతారం మల్లేపల్లి కన్నాల, నాగారం, గుంజపడుగు, గ్రామాలకు అణువుగా నాగారం గ్రామంలో ఆదివారం అంగడి వారసంత ఏర్పాటు చేయడం ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని  ప్రతి ఆదివారం జరిగే అంగడిని మంథని మండల పరిధి గ్రామాలైన ప్రజలు నాగారం పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.