11-01-2026 04:06:55 PM
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి
నిర్మల్,(విజయక్రాంతి): సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హతనుండి మినహాయింపు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తారని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం పిఆర్టియుటిఎస్ నిర్మల్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కలిసి టెట్ పరీక్ష విధానం వల్ల ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం నిర్మల్ శాసన సభ్యులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా PRTUTS 2026 డైరీ ఆవిష్కరించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పై మాట్లాడుతూ వాటి పరిష్కారానికై శాషన సభలో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఉద్యోగ , ఉపాధ్యాయుల పక్షాన ఉంటామని తెలియజేశారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు TET అవసరం లేదని, ప్రత్యేక చొరవ తీసుకొని TET విషయమై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు TET రద్దు అయ్యే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ తోట నరేంద్ర బాబు గారు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ,జిల్లా మండల బాధ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.