10 May, 2026 | 6:58 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

చాంపియన్‌కు షాకిచ్చి

19-08-2024 12:08 AM

ఫైనల్‌కు దూసుకెళ్లిన సబలెంక 

సిన్సినాటి (అమెరికా): సిన్సినాటి టోర్నీ మహిళల సింగిల్స్‌లో సబలెంక ఫైనల్ గడప తొక్కింది. మొ దటి సెమీఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ నెం బర్ 1 స్వియాటెక్‌ను 6-3, 6-3 తేడాతో వ రుస సెట్లలో మట్టికరిపించింది. ఒక గంట 47 నిమిషాల పాటు జరిగిన పోరులో పోలండ్‌కు చెందిన దిగ్గజ టెన్ని స్ ప్లేయర్ స్వియాటెక్ మీద బెలారస్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 3  సబలెంక పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచులో స్వియాటెక్ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. సబలెంక ఐదు ఏస్‌లు సంధించగా.. స్వియాటెక్ కేవలం ఒక్క ఏస్ మాత్రమే సంధించింది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో అమెరికా క్రీడాకారిణి పెగులాతో స్పానిష్ ప్లేయర్ బడోసా తలపడనుంది. ఈ పో రులో గెలిచిన వారితో సబలెంక రేపు ఫైనల్ ఆడనుంది.