10 May, 2026 | 5:46 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మహవీర్‌ను కలిసిన వినేశ్

19-08-2024 12:07 AM

చంఢీగడ్: హర్యానా సివంగి వినేశ్ ఫొగా ట్ తన సొంత గ్రామం హర్యానాలోని బలాలికి చేరుకుంది. తనకు రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్పిన తన పెద్దనాన్న మహవీర్ సింగ్ ఫొగాట్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతం అయింది. అంతకు ముందు వినేశ్ చేసిన పోస్టులో మహవీర్ సింగ్ గురించి ప్రస్తావించకపోవడంతో చాలా మంది విమర్శలు చేశారు. కానీ వినేశ్ మాత్రం తన సొంతూరికి వెళ్లగానే తన పెద్దనాన్నను కలిసింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి స్వగ్రామానికి వచ్చిన వినేశ్‌కు గ్రామస్తులు అదిరిపోయే స్వాగతం పలికారు. రూ. 21 వేలు జమ చేసి వినేశ్‌కు కానుకగా అందించారు. అంతే కాకుండా 750 కేజీల లడ్డూలను తయారు చేశారు. ఆ లడ్డూలను గ్రామం మొత్తం పంచి సంబరాలు చేసుకున్నారు. 

బలాలి బిడ్డలు రికార్డులు కొల్లగొట్టాలె

స్వగ్రామానికి చేరుకున్న వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ.. బలాలి నుంచి తన కంటే గొ ప్ప రెజ్లర్లు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బలాలి నుంచి వచ్చిన రెజ్లర్లు రికార్డులను తిరగరాయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన కంటే ఎంతో విజయవంతం కావాలన్నారు. అంతకు ముందు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వినేశ్‌కు అపూర్వ స్వాగతం లభించిన విషయం తెలిసిందే.