calender_icon.png 15 November, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హృదయాన్ని తాకే ప్రేమకథ

15-11-2025 12:26:15 AM

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ చిత్రా న్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నా రు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమాను వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మూవీ టీమ్ ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా కథ గురిం చి నాకు తెలుసు. వైరల్ కంటెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్న ఈ సోషల్ మీడి యా యుగంలో ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావడం సాధారణ విషయం కాదు. సోషల్ మీడియా యాప్స్ మారుతుంటాయి కానీ ప్రేమ మారదు.

ఈ సినిమా జెన్యూన్‌గా చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. హార్ట్ టచింగ్‌గా ఉంటుంది” అన్నారు. హీరో అఖిల్ ఉడ్డెమారి మాట్లాడుతూ.. “రాంబాయినిరాజు ప్రేమించినంత గొప్పగా మీరు మీ జీవితంలోని రాంబాయిని ప్రేమించండి. రాజు గొప్ప ప్రేమికుడు. నేనూ జీవితంలో రాజు లా ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ.. “ప్రేమకథలు ఎన్నో రావొచ్చు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ లవ్‌స్టోరీ వేరు.

ఇది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే ప్రేమకథ” అన్నారు. దర్శకుడు సాయిలు మాట్లాడుతూ.. “స్క్రిప్టును ఫార్మేట్‌లో ప్రిపేర్ చేయడం నాకు తెలియదు. కానీ, ఈ కథలోని భావోద్వేగాలను ఎలా చూపించాలో, సినిమా బిగినింగ్, ఇంటర్వెల్, క్లుమైక్స్ ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసు. సినిమా చేశాను” అన్నారు. ‘రాజు వెడ్స్ రాంబాయి చూస్తే ప్రేమికులు తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడి ప్రేమను ఎలా గెలిపించుకోవాలనేది తెలుస్తుంద’ని అన్నారు నిర్మాత రాహుల్ మోపిదేవి.