calender_icon.png 10 October, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను ఈ దేశంలో బతకనివ్వరా?

10-10-2025 01:55:11 AM

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును అడ్డుకునే విధంగా కొందరు వ్యవహారించడం దుర్మార్గమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు మండిపడ్డారు. బీసీలకు సంబంధించి పల్లెంలో అన్నంలో లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం హైకోర్టు ఆవరణలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మేము అడ్డుకోలేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎవరి జనాభా ఎంతో.. వారికి అంతా వాటా దక్కాలని రాహుల్‌గాంధీ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అడ్డుకుని బీసీలను అన్ని విధాలుగా అణగదొక్కున్నాయి. ఈ దేశంలో బీసీలను బతకనివ్వరా? మేం రాజకీయంగా, ఆర్థికంగా పైకి రావడం ఇష్టం లేదా? జ్యూడిషియల్‌లోనూ రిజర్వేషన్లు అమలు కావాలి. అప్పుడు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.

 పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు