25 August, 2026 | 1:40 AM

మరకత శివాలయంలో ‘శ్రావణ’ శోభ

25-08-2026 12:00 AM

అన్నదానం చేసిన వ్యాపారవేత్త స్వరూప శ్రీరాములు గౌడ్

శంకర్‌పల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివా రులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ హం పి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థాన సంచాలీత శ్రీ రాజరాజేశ్వరి సమేత బ్రహ్మసూ త్ర మరకత లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం రెండవ సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

శంకర్పల్లి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గండేటి స్వరూప శ్రీరాములు గౌడ్, బుల్కాపురం శ్రీశైలం రెడ్డి, కోనాపురం వడ్ల నరసింహ చారి, మందపాటి సత్యనారాయణ రెడ్డి, కృపానంద్ (హైదరాబాద్), ఇంద్రసేన అనూష్ (చేవెళ్ల) అన్నదానం నిర్వహించారు.

అన్నదాతలకు ఆలయ నిర్వాహకులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామివారి చిత్రపటాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ పి గ్యాస్ డీలర్ శ్రీదేవి, రుక్మిణి జగదీశ్వర్ గౌడ్, సావిత్రి సత్యనారాయణ గౌడ్, రఘు లతా గౌడ్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.