calender_icon.png 23 January, 2026 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నృసింహుని సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి

30-08-2024 12:36:50 AM

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 28 (విజయక్రాంతి) : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయ అధికారులు గోపూజలు, ఉట్లు కొట్టే వేడుక నిర్వహించారు. రుక్మిణీ కల్యాణ వేడుక జరిపించారు. గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణుడిగా నృసింహుడిని అలంకరించి తిరువీధుల్లో ఊరేగింపు చేపట్టారు. యువకులు కేరింతలు కొడుతూ ఉట్టి కొటే వేడుకలో పాల్గొన్నారు.