calender_icon.png 10 September, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల హృదయాల్లో శ్వేతారెడ్డి పదిలం

10-09-2025 12:05:45 AM

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మాజీమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సతీమణి చర్లకొల శ్వేత ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

మంగళవారం ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కీ.శే.చర్లకొల శ్వేత ప్రథమ వర్ధంతి సందర్భంగా స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట మండలం ఆవంచ గ్రామంలో విగ్రహావిష్కరణ చేసిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, డా.సి.లక్ష్మారెడ్డి శ్వేత విగ్రహానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

అనంతరం ఆవంచ గ్రామం లో వెంకటేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుజడ్చర్ల ప్రేమ్ రంగా గార్డెన్స్ లో జరిగిన ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై కీ.శే.శ్రీమతి శ్వేత చిత్రపటానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి,ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, గద్వాల బిఆర్‌ఎస్ ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.