10-09-2025 12:07:26 AM
అలంపూర్, సెప్టెంబర్ 9 : షేర్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసానికి సాఫ్ట్ వేర్ ఏకంగా రూ.22 పోగొట్టుకున్నాడు.ఈ ఘటన గద్వాల జిల్లా ఉండవల్లి పిఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎస్త్స్ర శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... ఉండవల్లి మండల పరిధిలోని ఇటిక్యాలపాడు గ్రామానికి చెందిన గౌ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్.
కాగా సోషల్ మీడియాలో వచ్చిన గ్రో యాప్ లో రూ. 50 వేలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు వస్తాయని ప్రకటన చూసి జూన్ 25న లక్షలు పెట్టుబడి పెట్టాడు. వెంటనే షేర్ మార్కెట్ నుండి రూ.3లక్షల జమ అయినట్లు గ్రో యాప్ లో చూపించినట్లు తెలిపారు.నిజమని నమ్మిన గౌరెడ్డి వెంకటేశ్వర రెడ్డి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.22 లక్షలు ఆన్లైన్ షేర్ మార్కెట్ గ్రో యాప్ ద్వారా పెట్టుబడి పెట్టాడు.
గ్రో యాప్ లో రూ.50 లక్షలు బ్యాలెన్స్ జమ ఉన్నట్లు చూపించడంతో బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకుందామని వెళ్లిన గౌరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ఎలాంటి బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలో లేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో కంగుతిన్న బాధితుడు గ్రో యాప్ నిర్వాహకులకు ఫోన్ చేయడంతో రూ.13 లక్షల టాక్సీ కట్టాలన్నారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సెప్టెంబర్ 5న సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు.