10-09-2025 12:05:07 AM
-సాధారణ ఎన్నికలను మరిపిస్తున్న ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9, (విజయక్రాంతి); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కే టి పి ఎస్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నేడు జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు రూ లక్షలు కు మ్మరిస్తున్నారు. ఒక్కొక్క ఓటుకు రూ 500 నుంచి రూ 1500 వరకు చెల్లించి ఓట్లను కొంటున్నట్టు విస్తృతంగా ప్రచారం అవుతుంది.
ఎంప్లాయిస్ కి సంబంధించి 120 కోట్ల డిపాజిట్లు కలిగిన కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ కావడంతో పోటీ హోరాహోరీగా సా గుతోంది. కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్, భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి పవర్ ప్లాంట్ చెందిన 3003 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు గాను జరుగుతుంది. బరిలో 37 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. నోటిఫికేషన్ వెలువడక ముందే పోటీ చేయాల నుకున్న అభ్యర్థులు సోషల్ మీడియా ద్వా రా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
నోటిఫికే షన్ వెలువడిన అనంతరం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో జన్కో ప్రాంతమంతా నిండిపోయింది. విధులను పక్కనపెట్టి గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఒక్క రాత్రే సమయం ఉన్నందున అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.
అవసరాన్ని పరిస్థితిని బట్టి ఒక్కొక్క ఓటును రూ500 నుంచి రూ 1500 వరకు వెచ్చించి ఓట్లు కొనుగోలు చేస్తున్నట్టు విశ్వాసనీయ సమాచారం. ఏది ఏమైనా జెన్కో ఎంప్లాయిస్ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ అత్యంత ఖరీదైన ఎన్నికగా తలపిస్తోంది. మరో 24 గంటల్లో ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైంది. గెలుపు ఎవరిదో వేచి చూడాలి.