7 July, 2026 | 2:23 AM

దేశ సమైక్యత కోసం శ్యాం ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం

07-07-2026 12:00 AM

గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావనీ వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు డా‘శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు.

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మహానేత, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆమె కార్యాలయంలో సోమవారం బీజేపీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహి చలేంగే అని నినదించిన మహానీయుడు, ఒక దేశం - ఒకే చట్టం అనే సిద్ధాంతం కోసం జీవించిన ఆయన ఆశయసాధనకు కట్టుబడి వున్నామని అన్నారు.  యువతకు, కార్యకర్తలకు ఆయనే స్ఫూర్తి. ఆ మహనీయుడి త్యాగం వృధా కానివ్వం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు, మహంకాళి జిల్లా బిజెవైఎం అధ్యక్షులు మద్దూరి శివాజీ, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, సత్తి రెడ్డి, మహమూద్, ఆనంద్ రావు, శ్రీనివాస్ యాదవ్, సాయి కుమార్, లక్ష్మణ్ యాదవ్, సత్యేంధర్, సాయిగౌడ్, శ్యామ్, సంయుక్తా రాణి, పూర్ణదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పౌరుడికి శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తిదాయకం: వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్‌పల్లి, జూలై 6 (విజయక్రాంతి): దేశంలోని ప్రతి పౌరుడికి డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాలు, ఆశయాలు స్ఫూర్తిదాయకమని బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు  వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. సోమవారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని   వడ్డేపల్లి రాజేశ్వరరావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి రాజేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ విద్యావేత్త, గొప్ప దేశభక్తుడు, దూర దృష్టి కలిగిన నాయకుడు అన్నారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదు అనే నినాదంతో దేశ సమగ్రత కోసం కృషి చేశాడన్నారు. భారతదేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. దేశాభివృద్ధి, జాతీయ వాదం కోసం నేటి యువత ఆయన చూపిన బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీనివాస గౌడ్, అనంత నాగరాజు, నర్సింగ్, గోపాలరావు, దుర్గ ప్రసాదరావు, శంకర్ రెడ్డి, సాయి, రమణారెడ్డి, మంజునాథ్, శేఖర్ రావు, తదితరులు పాల్గొన్నారు.