ఎన్నికల్లో పోటీ చేయను
రాజకీయాల్లో అవినీతి పెరిగింది
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు, జూలై 26: రాజకీయ రంగం అవినీతిమయమైందని, తనకు వయసు మీద పడటం, అనారోగ్య కారణాలతో 202 8 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఆదివారం ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన పదవీకాలం ఇంకా ఏడాదిన్న ర పాటు ఉందని, అప్పటివరకు తన వయస్సు 82 వరకు చేరుకుంటుందన్నారు.
తనకు ఆరోగ్యం మునుపటిలా సహకరించడం లేద ని, ఉత్సాహంతో పనిచేయడం ఇక సాధ్యం కాదన్నారు. అయితే ప్రజా జీవితంలో మా త్రం తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానన్నారు. 2028 నాటికి తన రాజకీయ ప్రస్తా నం 50 ఏళ్లకు చేరుకుంటుందని తెలిపారు.
1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా రాజకీ య జీవితాన్ని ప్రారంభించానని, ఎన్నో విజయాలు, ఓటములు చవిచూశానని పేర్కొ న్నారు. ఇన్నేళ్లలో తాను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ప్రజలే స్వచ్ఛందంగా డబ్బు సమకూ ర్చేవారన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజ లకు డబ్బు పంచాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ నా యకుడు, కార్యకర్త, ప్రజలకు సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపారు.






