ఉద్యమం ఇప్పుడే మొదలైంది
కేంద్ర మంత్రి రాజీనామాతో పోరాటం ఆగదు
దేశ యువత సమస్యలపై కొట్లాడుతాం
విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో మా పోరాటం ఆగద ని, ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని, దే శంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత గట్టిగా కొట్లాడుతామని తెలిపారు. దేశ విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు పోరాడుతామని తేల్చి చెప్పారు.
విద్యారంగంలో సమూల మార్పులు వచ్చేవరకు యువతతో కలిసి పనిచేస్తామని, గ్రా మీణ స్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని వెల్లడించా రు. చలో సంసద్ మార్చ్ సమయంలో పోలీసుల తీరును దీప్కే తప్పుబట్టారు. ఘర్షణల కు కారణమైన పోలీసు సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని వెల్లడించారు. అయితే పేపర్ లీకేజీతో మనస్థా పం చెంది ప్రాణాలు కోల్పోయిన విద్యార్థు ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు, ఒక్కో కుటుంబాని రూ.కోటి చొప్పు న నష్టపరిహారం చెల్లించాలని కోరారు.






