01-05-2025 01:32:53 AM
కరీంనగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కరీంనగర్ లోని స్థానిక మంకమ్మతోట, భగత్నగర్ సిద్ధార్థ విద్యా సంస్థల విజయభేరి మ్రోగించారు. 109 (27% ) మంది విద్యార్థులు 550 పైగా మార్కులు మరియు 179 (70%) మంది విద్యార్థులు 584, 582, 581, 580, 579 అత్యధిక మార్కులు సాధించి పాఠశాల కీర్తిని నలుదిశల చాటారు.
ఈ విద్యాసంవత్సరం మొత్తం 409 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 100% ఉత్తీర్ణతతో విజయ ప్రభంజనం సృష్టించారు. ఈ ఫలితాల పట్ల పాఠశాల ఛైర్మన్ దాసరి శ్రీపాల్రెడ్డి హర్షం వ్యక్తపరుస్తూ, ఈ విజయానికి కారణమైన విద్యార్థులను, తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు.
ఆయన మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాలలో అటు మార్కుల యుగంలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించగా, ఇటు మార్కులు గ్రేడులలోను అత్యున్నత ఫలితాలను సాధిస్తూ వస్తుందని, ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు, పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.