calender_icon.png 1 May, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ కమిషనరేట్‌లో పలు మార్పులు

01-05-2025 01:34:35 AM

కొత్తగా రెండు లాఅండ్‌ఆర్డర్ జోన్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30(విజయక్రాంతి) : హైదరాబాద్ పోలీస్ కమిషన రేట్ పునఃవ్యస్థీకరణతో కమిషనరేట్ పరిధిలో పలు మార్పులు జరిగినట్లు హైదరా బాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ౩౫ ఏళ్ల తరువాత మార్పులు చేసినట్లు చెప్పారు. జీవో 32ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా పోలీస్ స్టేషన్ల హద్దులు, కొత్త పోలీస్ స్టేషన్లకు వెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజల నుంచి రెండు సంవత్సరాలుగా వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మార్పులతో రాబోయే పదేండ్ల పాటు హైదరాబాద్‌నగర పోలీసులు బాగా పని చేసేందుకు అనుకూలంగా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. పునర్‌వ్యవస్థీకరణలో జరిగిన మార్పులు, పోలీస్ స్టేషన్ల వివరాలు తదితర అంశాలను తమ వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. కాగా  ప్రభు త్వం ఇచ్చిన జీవో ప్రకారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సౌత్‌ఈస్ట్, సౌత్‌వెస్ట్ లాఅండ్‌ఆర్డర్ జోన్‌లు, మరో ట్రాఫిక్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరో 11లాఅండ్ ఆర్డర్ పోలీస్‌స్టే షన్లు, 13ట్రాఫిక్‌పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిషనరేట పరిధిలోని 7జోన్లలో ప్రతీ జోన్‌లో మహిళా పోలీస్ స్టేషన్, ఐటీవింగ్, సైబర్‌క్రైమ్ యూనిట్, నార్కొటిక్స్ వింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  ఈ మార్పులలో భాగంగా అధనంగా 1200మంది సిబ్బంది మంజూ రయ్యారని తెలిపారు

పలు పోలీస్ స్టేషన్ల పేర్లు మార్పు

ప్రస్తుతం నగరంలో 71లాఅండ్‌ఆర్డర్ పోలీస్ స్టేషన్లుండగా కొత్తగా టోలీచౌకీ లాఅండ్‌ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.  ఇప్పటివరకు ఫిల్మ్‌నగర్ పీఎస్(పోలీస్ స్టేషన్), మెహదీపట్నం పీఎస్, గోల్కొండ పీఎస్‌లో ఉన్న పలు ప్రాంతాలను టోలీచౌకీ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. కాగా ఇప్పటివరకు ఉన్న గోల్కొండ డివిజన్‌ను టోలీచౌకి డివిజన్‌గా మార్చారు.

సెక్రటేరియట్ పీఎస్‌ను లేక్ పీఎస్‌గా, హుమాయున్ నగర్ పీఎస్‌ను మెహదీ పట్నం పీఎస్‌గా, షాహినాయత్‌గంజ్ పీఎస్‌ను గోషామహల్ పీఎస్‌గా మార్చారు. ట్రాఫిక్ నాంపల్లి పీఎస్, ట్రాఫిక్ అంబర్‌పేట్ పీఎస్, ట్రాఫిక్ లంగర్‌హౌజ్ పీఎస్, ట్రాఫిక్ బహదూర్‌పుర పీఎస్, ట్రాఫిక్ నల్లకుంట పీఎస్‌ల పేర్లను ట్రాఫిక్ గాంధీనగర్‌పీఎస్, ట్రాఫిక్ ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్, ట్రాఫిక్ కుల్సుంపురపీఎస్, ట్రాఫిక్ ఛత్రినాకా పీఎస్, ట్రాఫిక్ సైదాబాద్ పీఎస్‌లుగా మార్చారు.

మహిళా భద్రత వింగ్ బలోపేతం..

మహిళా భద్రత వింగ్(డబ్ల్యూస్‌డబ్ల్యూ) బలోపేతానికి ప్రత్యేకంగా యాంటీ హ్యు మన్ ట్రాఫికింగ్ యూనిట్(ఏహెచ్‌టీయూ) ఏర్పాటు చేశారు. దీని కోసం ఒక ఇన్‌స్పెక్టర్, 8మంది సిబ్బందిని నియమించారు. జువైనల్ బ్యూరో యూనిట్‌కు 1ఇన్‌స్పెక్టర్ మరో 7మంది సిబ్బంది ఉంటారు. ప్రతీ లాఅండ్‌ఆర్డర్ డివిజన్‌లో ఒక సైబర్ క్రైమ్ సెల్‌ను ఒక సీఐ మరో ఐదుగురు సిబ్బందితో ఏర్పాటు చేశారు. 

  1. హైదరాబాద్ కమిషనరేట్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

146మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30(విజయక్రాంతి) : హైదరాబాద్ పోలీస్ కమిషనరరేట్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఏకంగా నగరంలోని 146మంది సీఐలను ఒకే సారి బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వీరిలో పలువురు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు(డీఐ), ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ల్లు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లను ఎస్‌హెచ్‌వోలుగా నియమించగా, మరి కొంత మంది ఎస్‌హెచ్‌వోలను డీఐలు, ఇతర విభాగాల ఇన్‌స్పెక్టర్లుగా బదిలీ చేశారు. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లు వెంటనే తమ స్థానాలను వదిలీ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.