calender_icon.png 28 August, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలదిగ్బంధంలో సిద్దిపేట పట్టణం

28-08-2025 09:56:51 AM

భారీ వర్షాలతో ఇబ్బందులు 

సిద్దిపేట, (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) కేంద్రంలో పలు కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస నగర్, అర్బన్ తహసిల్దార్ కార్యాలయం, సమీపం తోపాటు పలు కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వరద నీరు కాలనీలను నిర్బంధం చేశాయి. అత్యవసరానికి కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. వరదనీటి ప్రభావం పెరగడంతో కోమటి చెరువు నిండి మత్తడి పొంగిపొర్లుతున్నాయి. దాంతో కోమటి చెరువు ప్రధాన కెనాల్ నిండి కాలువకు ఇరువైపులా ఉన్న నివాసాలలోకి నీరు చేరాయి.

కాలువలో పూడిక తీయకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. సిద్ధిపేట హైదరాబాద్ ప్రధాన రహదారి(Siddipet Hyderabad Main Road) నీటితో నిండిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక సీతారామాంజనేయ థియేటర్ వద్ద భారీగా వరద నీరు నిలవడంతో పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసరాలకు తప్ప ఇల్లాల్లో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.