calender_icon.png 28 August, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలిగొండ-భువనగిరి మధ్య నిలిచిపోయిన రాకపోకలు

28-08-2025 09:59:32 AM

 ట్రాఫిక్ ను మళ్లించిన అధికారులు

వలిగొండ,(విజయక్రాంతి): మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో వలిగొండ-భువనగిరి ప్రధాన రహదారిపై(Valigonda-Bhuvanagiri main road) నాగిరెడ్డిపల్లి వద్ద భారీ ఎత్తున వరద నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీస్ ట్రాఫిక్ రెవిన్యూ యంత్రాంగం అప్రమత్తమై రాకపోకలను మళ్లించారు వలిగొండ మండలంలోని నాగారం వద్ద భారీకేర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ చౌటుప్పల్ మీదుగా మళ్ళించారు. భారీ వర్షం కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమై పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.