28-08-2025 09:53:27 AM
జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు(Koulas Nala project lifted) 5 గేట్లు ఎత్తివేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ సుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎగువ భాగం నుంచి వరద నీరు భారీగా వస్తుందని పేర్కొన్నారు. ఇన్ ఫ్లో 26,560 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 26,560 క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను ప్రస్తుతం 457.80 మీటర్లుగా ఉన్నట్లు వారు చెప్పారు. ప్రాజెక్టు దిగువ భాగంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు వాగు పక్కన ఉన్న పంట పొలాల్లోకి కూడా రైతులు వద్దని సూచించారు. గొర్రెల కాపరులు పశువుల కాపరులు ఇంటి వద్ద పశువులను కట్టివేయాలని పేర్కొన్నారు. మరో రెండు రోజులపాటు అల్పపీడనం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.